Monday, October 21, 2024

మహారాష్ట్ర బిజెపి తొలి జాబితాలో ఫడ్నవీస్ పేరు

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ వెస్ట్ సీటుకు ఫడ్నవీస్ పోటీ
అశోక్ చవాన్ కుమార్తెకూ స్థానం
99 పేర్లతో పార్టీ జాబితా వెల్లడి

ముంబయి/ న్యూఢిల్లీ : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి తొలి అభ్యర్థుల జాబితాలో దిగ్గజాల్లో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రకటించిన పార్టీ జాబితాలో 99 పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉన్నాయి. బిజెపి సుమారు 160 సీట్లకు పోటీ చేయవచ్చు. మిగిలిన సీట్లకు బిజెపి మిత్ర పక్షాలు శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి పోటీ చేయనున్నాయి. ఫడ్నవీస్ నాగ్‌పూర్ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేయనున్నారు. ఆయన ఆ సీటుకు 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగ్‌పూర్ బిజెపికి కంచుకోట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో నాగ్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింటిని బిజెపి గత ఎన్నికల్లో గెలుచుకున్నది. ఇతర ప్రముఖుల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులె నాగ్‌పూర్ జిల్లాలోని కాంఠి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్‌ను బల్లార్‌పూర్ సీటుకు, కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దన్వే కుమారుడు సంతోష్‌ను భోకర్దాన్ సీటుకు బిజెపి నిలబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌ను భోకర్ స్థానంలో తమ అభ్యర్థిగా బిజెపి నిర్ణయించింది. అశోక్ చవాన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. మహారాష్ట్ర ఎన్నికల కోసం బిజెపి తొలి జాబితాలో 13 మంది మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ తెగల నుంచి ఆరుగురు,షెడ్యూల్డ్ కులాల నుంచి నలుగురు అభ్యర్థులు ఉన్నారు.

బిజెపి పలువురు సిట్టింగ్ ఎంఎల్‌ఎలను మహారాష్ట్రలో తిరిగి తమ అభ్యర్థులుగా నిలబెట్టడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం లేకుండా చేయడానికి బిజెపి సాధారణంగా రాష్ట్రంలో, జాతీయ ఎన్నికల్లో అధిక సంఖ్యాక సిట్టింగ్ ప్రతినిధులను మార్చి, వోటర్లకు కొత్త ఆప్షన్ ఇస్తుంటుంది. సంక్లిష్టమైన ఎన్నికల పోరుగా భావిస్తున్న ఈ ఎన్నికలకు ముందు బిజెపి ధీమాతో ఉందని సిట్టింగ్ ఎంఎల్‌ఎలను కొనసాగించాలన్న నిర్ణయం సూచిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సేన ఎన్‌సిపి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ సీట్లలో కేవలం 17 సీట్లను కూటమి గెలుచుకున్నది. శివసేన (యుబిటి), కాంగ్రెస్, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి రాజకీయంగా గణనీయమైన ఈ రాష్ట్రంలో 30 సీట్లను కైవసం చేసుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News