Monday, November 25, 2024

డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఫడ్నవిస్

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ విషయాన్ని అదిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. తన రాజీనామాను సిఎం ఏక్ నాథ్ షిండేకు పంపించారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు పూర్తిగా బాధ్యత తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇక్కడి పార్టీకి నాయకత్వం వహించానని… ప్రభుత్వ పదవి నుంచి తనను విడుదల చేయమని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. తాను అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాని చెప్పారు.

మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ స్థానాలకు కేవలం 9 సీట్లకే పరిమితమైంది. 2019 కంటే ఈ సారి సగానికి పైగా సీట్లు తగ్గిపోయాయి. ఇక, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు కూడా అనుకున్నంత ఫలితాలు రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News