Friday, November 22, 2024

ఉద్ధవ్ సర్కార్ పతనం వెనుక ఫడ్నవీస్ పాత్ర: మహారాష్ట్ర మంత్రి వెల్లడి

- Advertisement -
- Advertisement -

 

ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని కూల్చడంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వెల్లడించారు. సోమవారం ఆయన తన సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏక్‌నాథ్ షిండేతో బిజెపి నాయకుడు ఫడ్నవీస్ దాదాపు 150 సార్లు భేటీ అయ్యారని వెల్లడించారు.

ఏక్‌నాథ్ సిండే తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయి షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా 2022 జూన్‌లో కొత్త ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పడింది. అయితే..ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోవడం వెనుక తమ పాత్ర ఏమీ లేదని బిజెపి నాయకులు, ఫడ్నవీస్ ఇప్పటివరకు చెప్పుకొస్తున్నారు. శివసేనలో అంతర్గత పోరు వల్లే షిండే తిరుగుబాటు జరిగిందని వారు చెబుతుండగా అవన్నీ అసత్యాలని ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ తాజా వ్యాఖ్యలతో బట్టబయలైంది.

ఉద్ధవ్ క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వనందుకే పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయాలని ఆనాడే తాను నిర్ణయించుకున్నానని సావంత్ తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనను పక్కనపెట్టడం ప్రారంభించారని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆనాడే తాను నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతానికి చెందిన అసంతృప్త శివసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి వారంతా ఉద్ధవ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరేలా చొరవ చూపానని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News