Monday, January 13, 2025

ఆ దోషులకు ఘనస్వాగతం కచ్చితంగా తప్పే: ఫడ్నవీస్

- Advertisement -
- Advertisement -

ముంబై : బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించి వచ్చిన 11 మందికి ఘనస్వాగతం పలకడాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు పట్టారు. ఈ దోషులను గుజరాత్ ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ అతివాద సంస్థ వీరికి దండలు, మిఠాయిలతో స్వాగతం పలికిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ “ దోషులు ఎప్పటికీ దోషులే… వారిని సత్కరించడాన్ని ఏ విధంగానూ సమర్థించలేం” అని వ్యాఖ్యానించారు. ముంబై లోని బాంద్రా ప్రాంతంలో 35 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించిన కేసుపై మహారాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసును ఈ సభలో ప్రస్తావించడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొన్నారు. “2002 నాటి బిల్కిస్ బానో కేసులో దోషులను సుప్రీం కోర్టుకు చెందిన ఓ ఆదేశాన్ని అనుసరించి గుజరాత్‌లో విడుదల చేశారు. కానీ ఓ నేరంలో దోషులను సత్కరించడం తప్పు. అలాంటి చర్యలను సమర్థించుకొనే అవకాశమే ఉండదు” అని పడ్నవీస్ వ్యాఖ్యానించారు.

Fadnavis slams felicitation of Bilkis Bano Case Convicts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News