Monday, December 23, 2024

ఫైనల్లో ఓటమి.. ప్రియురాలితో బ్రేకప్ లాంటిది

- Advertisement -
- Advertisement -

దర్బన్: భారత్ వేదిక జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో టైటిల్ ఫైట్‌కు చేరిన భారత్ ఆస్ట్రేలియాపై ఓటమితో కప్ చేజార్చుకుంది. అయితే ఓ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు, మాజీ సారధి డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఫాఫ్ డూప్లెసిస్ ఎన్‌డిటివితో మాట్లాడుతూ.. ‘2015లో జరిగిన వరల్డ్ కప్ మా జట్టు టోర్నీ అంతా అద్భుతంగా ఆడి విజయాలు సాధించి సెమీస్‌కు చేరామని, సెమీస్‌లో మాకు ఊహించలేని ఓటమి ఎదురైందని, భారత్ సొంత గడ్డపై ఓటమి కూడా అంత తేలికగా మరవలేదని, ఇంకొంచెం సమయం పడుతుందని, ఈ ఓటమి ప్రియురాలితో విడిపోవడం వంటిదని, వెంటనే దీనిని మరిచిపోలేం’ అని డూప్లేసిస్ 2015 వరల్డ్ కప్‌లో తమ జట్టు ఓటమిని గుర్తుచేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News