Saturday, November 16, 2024

మోడీకి ‘హనుమాన్‌ చాలీసా’ సెగ

- Advertisement -
- Advertisement -

 

Modi

న్యూఢిల్లీ: దేశంలో హనుమాన్‌ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బిజెపి, ఎన్‌సిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సిపికి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ అధికారిక నివాసం) హనుమాన్‌ చాలీసా, నమాజ్‌, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది.

హనుమాన్‌ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామ‌ని న‌వ‌నీత్ రాణా దంప‌తులు మొద‌ట్లో ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత విర‌మించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్ష‌న్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరు పరుచగా.. వీరిద‍్దరికీ మే 6 వ‌ర‌కు జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ స‌న్‌డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News