- Advertisement -
శ్వేతసౌధంలో మరోమార్పునకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. ప్రతిశుక్రవారం ఫెయిత్‌హౌస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి టెలిఇవాజలిస్ట్ పౌలా వైట్ నాయకత్వం వహించాలని పేర్కొన్నారు. ఆమెను ట్రంప్‌కు ఆధ్యాత్మిక సలహాదారుగా భావిస్తుంటారు. అంతకు ముందు రోజే అటార్నీజనరల్ పామ్‌బోండీ నేతృత్వంలో పనిచేసేందుకు ఓ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు. అమెరికా క్రిస్టియన్లపై వేధింపులు లేకుండా చేసేందుకు ఇది పనిచేస్తుంది. ఇవాంజ్లికల్ క్రిస్టియన్లు ట్రంప్‌కు 2024 ఎన్నికల్లో బలమైన మద్దతుదార్లుగా వ్యవహరించారు.
- Advertisement -