లక్నో: ఫైజాబాద్ రైల్వే స్టేషన్‌ను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చుతున్నట్లు రైల్వేస్ మంగళవారం ప్రకటించింది. ఈ మార్పు తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని గత నెల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉత్తర రైల్వే లక్నో డివిజన్‌కు చెందిన ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చుతున్నామని, ఈ మార్పు తక్షణం అమలులోకి వస్తుందని ఉత్తర రైల్వే పిఆర్ఓ దీపక్ కుమార్ మంగళవారం ఇక్కడొక ప్రకటనలో తెలియ.ఏశారు. ఫైజాబాద్ స్టేషన్‌ను ఇకపై అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్‌గా పిలుస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ట్వీట్లో తెలియజేసింది. ఈ నిర్ణయానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకుతన అంగీకారం తెలిపిందని మరో ట్వీట్లో సిఎంఓ తెలిపింది. ఇంతకు ముందు 2018లో యుపి ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా పేరుమార్చిన విషయం తెలిసిందే.1874లో ప్రారంభమైన ఫైజాబాద్ రైల్వే స్టేషన్ లక్నోవారణాసి సెక్షన్ కిందికి వస్తుంది.