Monday, January 20, 2025

సిఎం కెసిఆర్ పేరిట ఫేక్ కాల్ రికార్డింగ్

- Advertisement -
- Advertisement -


సిఎం కెసిఆర్ కాల్ రికార్డింగ్ వైరల్..
దీని వెనుకాల బిజెపి హస్తం,
ఫేక్ ఆడియో కాల్ అంటున్న టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్
హైదరాబాద్ సిసిఎస్‌లో ఫిర్యాదు
ఐపిసి సెక్షన్స్ 469, 505(2) కింద కేసు నమోదు, దర్యాప్తు
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న వేళ.. పోలింగ్ ప్రారంభానికి మరి కొన్ని గంటల వ్యవధి మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు శతధా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సిఎం కెసిఆర్ పేరుతో ఓ ఆడియో క్లిప్ హల్‌చల్ చేస్తోంది. మునుగోడుకు చెందిన ఓ వ్యక్తితో కెసిఆర్ మాట్లాడుతున్నట్లుగా ఈ ఆడియో క్లిప్‌లో ఉంది. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఆడియో క్లిప్‌పై టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ స్పందించింది. సిఎం పేరుతో ప్రత్యర్థులు ఈ ఆడియో కాల్ క్రియేట్ చేశారని, ఇదంతా ఫేక్ అని ఖండించింది. మిమిక్రీతో సిఎం కెసిఆర్ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ ఈ ఆడియో కాల్ క్రియేట్ చేసి ఉంటారని, దీని వెనుకాల బిజెపి హస్తం ఉండవచ్చునని టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, ఇదే విషయమై హైదరాబాద్ సిసిఎస్‌లో టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదునందుకున్న పోలీసులు సిఎం కెసిఆర్ పేరుతో నకిలీ ఆడియో కాల్ క్రియేట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై ఐపిసి సెక్షన్ 469, 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. పధాన పార్టీలకు టగ్ ఆప్ వార్‌గా మారిన మునుగోడు బైపోల్ ముంగిట ఇలాంటి ఫేక్ సర్వే ఫలితాలు, లేఖలు, ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ ఓ నకిలీ ఆడియో కాల్ సృష్టించడం ప్రతి ఒక్కరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. ఎన్నికల్లో ఏ విధంగానైనా లబ్ది పొందాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష బిజెపి ఈ దుష్ట పన్నాగానికి పాల్పడి ఉండవచ్చని టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ భావిస్తోంది. గత రెండ్రోజుల వ్యవధిలో టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం, ఘర్షణ వాతావరణం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన సంగతి విదితమే. ఇలాంటి సమయంలో మునుగోడుకు చెందిన ఓ వ్యక్తితో సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నట్లుగా ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్‌తో పాటు టిఆర్‌ఎస్ శ్రేణులు మండి పడుతున్నారు. ఇలాంటి దుష్టపన్నాగాల వల్ల సాధించేదేమీ ఉండబోదని.. నేడు పోలింగ్ ఉందనగా ఇలాంటి జిమ్మిక్కులకు బిజెపి తెరలేపిందని టిఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ బలంగా భావిస్తోంది. కాగా, ఈ విషయమై నిజానిజాలు ఏమిటనేది పోలీసులే తేల్చాల్సి ఉంది.

Fake Audio Call Record on name of CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News