మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని మోసం చేసిన నకిలీ బాబాను లంగర్‌హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని నెల్లూరులోని దర్గాకు చైర్మన్‌గా ఉన్న షా గులాం నక్షాబంద్ హఫీజ్ పాషా నగరంలోని మలక్‌పేటలో ఉంటున్నాడు. నగరంలోని లంగర్‌హౌస్‌కు చెందిన బాలిక మూడేళ్ల క్రితం అనారోగ్యానికి గురైంది. గుండె, బ్రితింగ్, బ్రేయిన్ సమస్యలను ఎదుర్కొంది, ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గలేదు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన వారు రెహ్మతాబాద్ షరీఫ్ దర్గా బాబా వద్దకు వెళ్తే ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. దీంతో బాబాను బాలిక కలిసింది, అక్కడ బాధితురాలితో ప్రార్థన చేపించాడు. తర్వాత తన ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరింది. దీంతో లంగర్‌హౌస్‌లోని ఎండి లైన్స్‌లోని బాధితురాలి ఇంటికి వచ్చిన నకిలీ బాబా బాలిక ప్రైవేట్ పార్ట్‌ను టచ్ చేశాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు నిలదీయడంతో బాలిక మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు రూములో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని గమనించని నకిలీ బాబా బాలికతో అదే విధంగా ప్రవర్తించాడు, ఇది మొత్తం రికార్డయింది. దానిని చూపించి నిలదీయడంతో బాలికను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ నెల 10 తేదీన వివాహం చేసుకుంటానని చెప్పాడు. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఇప్పటి వరకు ఎనిమిది మందిని వివాహం చేసుకుంటానని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.