Sunday, December 22, 2024

హైదరాబాద్ లో దారుణం.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యం పేరుతో నవ వధువుపై ఓ నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. పాతబస్తీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలోని హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే, యువతి ఆరోగ్యం బాగా లేదని అత్తమామలు బండ్లగూడలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు. దీంతో యువతి ఆరోగ్యం బాగా చేస్తానని నమ్మించిన బాబా, నవ వధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలియడంతో నకిలీ బాబా అక్కడి నుంచి పారిపోయాడు.

అత్తమామలకు విషయం చెప్పినా పట్టించుకోవట్లేదని, దయ్యం పట్టిందని ఇంట్లోనే బంధించారని నవ వధువు పేర్కొంది. చివరికి తల్లిదండ్రుల సాయంతో భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందని బాధితురాలిని అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపించారు. దీంతో పోలీసులు కూడా న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని యువతి పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News