Wednesday, January 22, 2025

నవ వధువుపై అత్యాచారం చేసిన బజార్ బాబా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నవ వధువుపై అత్యాచారం చేసిన నకిలీ బాబాను బండ్లగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హుస్సేనీఆలంకు చెందిన నవ వధువు వివాహమై మూడు నెలలు అవుతోంది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అత్తామామ బండ్లగూడలోని బజార్ బాబా వద్దకు తీసుకుని వెళ్లారు. ఆమెపై మూడు దెయ్యాలు ఉన్నాయని వారిని నమ్మించి, అత్తామామను గదిబయట ఉండాలని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన వారు బయటికి రాగానే నకిలీ బాబ యువతిని బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇంటికి వచ్చిన మూడు రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి భర్త, అత్తామామకు చెప్పింది.

దీనిని నమ్మని వారు యువతిని గదిలో బంధించారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంటికి వచ్చి నిలదీశారు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బండ్లగూడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బజార్‌బాబా పారిపోయాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు మహబూబ్‌నగర్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News