Friday, November 22, 2024

నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Fake Birth Certificates Gang arrest in Hyderabad
రూ.1,500 ఒక సర్టిఫికేట్ ఇస్తున్న నిందితులు
నలుగురు అరెస్టు, పరారీలో ఇద్దరు
వివరాలు వెల్లడించిన వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్

హైదరాబాద్: నకిలీ బర్త్, డెత్ సర్టిఫికేట్లు ఇస్తున్న ముఠాను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ బర్త్ సర్టిఫికేట్లు, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.19,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన అజిజ్ కాసీం జిహెచ్‌ఎంసి సర్కిల్ 7లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన ఆకుల సతీష్ జిహెచ్‌ఎంపిలో కాంట్రాక్ట్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమాజిగూడకు చెందిన ఎండి రసూల్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మలక్‌పేటకు చెందిన సయిద్ హుస్సేన్ ఇక్బాల్, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన ఆరిఫ్ అహ్మద్ సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. హుమాయున్‌నగర్‌కు చెందిన ఎండి రషీద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన అంకిత్ కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సాధారణంగా డెత్, బర్త్ సర్టిఫికేట్లు జిహెచ్‌ఎంసి 15 రోజుల్లో జారీ చేస్తుంది.

అత్యవసరం ఉన్న వారి నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ వాటిని ఆన్‌లైన్ చేయడంతో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉంటుంది. దానిని క్యాష్ చేసుకుంటున్నారు నిందితులు గత కొంత కాలం నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికేట్లను ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు డిఛార్జ్ సమ్మరిని ఆస్పత్రులు సమర్పించాలి, దానిని జిహెచ్‌ఎంసికి సమర్పించాల్సి ఉంటుంది. వాటిపై జిహెచ్‌ఎంసి ఎఎంఓహెచ్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్‌ను జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు తీసుకుని అందరు కలిసి పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారో దర్యాప్తు చేస్తున్నామని డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ 63 అప్లికేషన్లు అప్‌లోడ్ చేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎడిసిపి,ఎసిపి, ఇన్స్‌స్పెక్టర్ సైదులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News