Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో.. ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్, సిఐఎస్ఎఫ్ లతోపాటు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు అగంతకుడు ఫేక్ మెయిల్ పంపిించినట్లు గుర్తించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. అతని ఆచూకీ కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News