- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. గురుగ్రావ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు నిర్వాహకులున్నారు. ఏడాది కాలం నుంచి కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఢిల్లీలో అరెస్టైన ఎనిమిది మందిని హైదరాబాద్ కు తరలించారు.
- Advertisement -