Monday, December 23, 2024

గోవిందరావుపేటలో నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠా?

- Advertisement -
- Advertisement -

గోవిందరావుపేట: గ్రామ పంచాయతీలో ఇంటి మార్పిడికి ఇచ్చే యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని ధృవీకరించి ఇచ్చే అధికారి సంతకం ఇటీవల ఫోర్జరీ జరిగిందని వెలుగులోకి వచ్చినా సంబంధిత అధికారి మౌనంగా ఉండడంపై సర్టిఫికేట్ల తయారీదారుల ముఠా సంబంధిత అధికారికి సంబంధాలు ఉన్నాయోమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నకిలీ సర్టిఫికేట్ల తయారీ ద్వారా బ్యాంకులలో అధిక మొత్తంలో రుణాలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా మండలంలో ఒక మేజర్ గ్రామ పంచాయతీని టార్గెట్‌గా చేసుకొని నకిలీ సర్టిఫికేట్లను సృష్టించి వాటి ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి ఈ సర్టిఫికేట్ల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి అధిక మొత్తంలో కమిషన్లు వసూలు చేసే ముఠా తయారయ్యింది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారిని ఎందుకు పట్టించుకోవడం లేదని దీనిపై వివరణ కావాలని అడిగితే అడిగినప్పుడల్లా కేసు నమోదు చేస్తానని చెప్పడమే గాని సంఘటన వెలుగులోకి వచ్చి సుమారు నెల రోజులు గడుస్తున్న ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడంపై సర్టిఫికెట్ల తయారీలో సంబంధిత అధికారికి తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేయించుకున్న ఇంటి యజమానులకు లోపాయికారి ఒప్పందాలు ఉండడం వలన ఫోర్జరీ విషయంలో సర్టిఫికేట్లు తయారీదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆ అధికారి ఇకనైనా స్పందించి కేసు నమోదు చేస్తే వాస్తవాలు బయటకు వచ్చి నకిలీ సర్టిఫికేట్ల తయారీదారులు ముఠా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఫోర్జరీలు ఎన్ని జరిగాయో బహిర్గతం అవుతాయోనని స్థానికులు అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News