- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మలక్ పేట్ లో అంతరాష్ట్ర నకిలీ సర్టిఫికేట్ ముఠా గుట్టు రట్టైంది. మంగళవారం మధ్యాహ్నం మలక్ పేట్ పోలీసులు దాడి చేసి 10మంది నకిలీ సర్టిఫికేట్ల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన ఏడుగురు విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్స్ తో ఉన్నత విద్యా వ్యవస్థ నాశనం అవుతోందని హైదరాబాద్ సిపి ఆనంద్ అన్నారు. మలక్ పేట్ లో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టేన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నారు.తల్లిదండ్రులకు తెలిసే విద్యార్థుల నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Fake Certificate Racket Busted in Malakpet
- Advertisement -