Thursday, January 23, 2025

నకిలీలపై మౌనమేల..?

- Advertisement -
- Advertisement -

స్పందించని సంబంధిత శాఖాధికారులు
మగధ యూనివర్సిటీకి తెలంగాణలో యూజిసి గుర్తింపు ఉందా?
‘మన తెలంగాణ’ చేతిలో నకిలీల గుట్టు
కలెక్టర్ సారూ మీరైనా స్పందించండి

మన తెలంగాణ/కొత్తగూడెం : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన పొందారనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగాల కోసం కొందరు తెలంగాణాలో గుర్తింపులేని యూనివర్సీటిల నుండి అడ్డదారిలో సర్టిఫికెట్లు తెచ్చుకుని వార్డెన్లుగా చెలామణి అవుతున్నట్లు తెలియవస్తోంది. గత కొద్దిరోజులుగా సంక్షేమశాఖపై తీవ్ర అరోపణలు వస్తున్నప్పటికి ఆ శాఖాధికారులు మౌనం వీడకపోవడం ఈ అరోపణలకు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014వ సంవత్సరంలో నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షేమశాఖాధికారులు సుమారు 20మంది డిగ్రీ ఉత్తీర్ణులై వసతిగృహాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సీనియారిటి ప్రకారం సంక్షేమాధికారులుగా పదోన్నతులు కల్పించారు. అ సందర్భంలో అదే శాఖలో పనిచేస్తున్న మరికొందరు ఆశావహులు తాము 2005వ సంవత్సరంలో డిగ్రీలు ఉత్తీర్ణతై ఉన్నామని తమకూ పదోన్నతులు కల్పించాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నట్లు సమాచారం.

స్పందించిన అధికారులు వారు ఉత్తీర్ణులైన డిగ్రీ సర్టిఫికేట్లను తెప్పించుకుని వాటిని పరిశీలించిగా ఆయా యూనివర్సీటిలకు తెలంగాణాలో యూజిసి గుర్తింపు లేదని తేలడంతో వారికి ప్రమోషన్లు ఇవ్వడానికి నిరాకరించారు.దీంతో సదరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు.సీనియార్టీ ప్రతిపాదికన ప్రమోషన్లు ఇవ్వాలన్న కోర్టు అర్డర్ను బూచిగా చూపి రాత్రికిరాత్రే సంక్షేమాధికారులుగా పదోన్నతులు పొందారు.సదరు వ్యక్తులు సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్లుకు తెలంగాణాలో యూజిసి గుర్తింపులేదని జిల్లా సంక్షేమాధికారులకు తెలిసినప్పటికి కోర్టు ఆదేశానూసారమే ప్రమోషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.నాటి నుండి ఆ విషయంపై అడపదడప అరోపణలు వస్తున్నప్పటికి అధికారులు పెడచెవిన పెడుతువచ్చారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నకిలీ సర్టిఫికేట్లపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో సంక్షేమశాఖపై వస్తున్న అరోపణలు మరోమారు తీవ్ర చర్చకు దారితీశాయి.ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News