Monday, December 23, 2024

నకిలీ పోలీస్ అధికారి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూడ్ వీడియోల పేరుతో యువతిని బ్లాక్‌మేయిల్ చేస్తున్న నకిలీ పోలీస్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3లక్షల నగదు, బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్, పార్సిగుట్టకు చెందిన జాదవ్ సన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిందితుడికి బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ అలవాటు ఉండడంతో వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. దీంతో పోలీస్ చెపుకుంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో మాదాపూర్ పోలీసులు 2017లో గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని మారియట్‌లో హోటల్ వద్దకు యువతిని పిలిపించుకున్నాడు. మీ న్యూడ్ వీడియోలు తన వద్ద ఉన్నాయని రూ.5లక్షలు ఇస్తే వాటిని

బయటపెట్టనని బెదిరించడంతో బాధితురాలు రూ.5లక్షలు ఇచ్చింది, అంతేకాకుండా ఆమె మెడలోని బంగారు చైన్‌ను కూడా నిందితుడి తీసుకున్నాడు. అయినా కూడా యువతిని వదిలిపెట్టకుండా ఫోన్లు చేసి మళ్లీ రూ.5లక్షలు కావాలని బెదిరించి తీసుకున్నాడు, అయినా వేధింపులు ఆపకుండా ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. నిందితుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సైలు శ్రీనివాసులు, గగన్‌దీప్, అశోక్‌రెడ్డి దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News