Sunday, December 22, 2024

నల్గొండలో నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నల్లొండ: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 1.80 కోట్ల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గొరుట్ల నాగార్జున, గడ్డం రవీంద్రబాబు, వేణుగా గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిందితులు కర్నాటకలో తక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. నాగపుర్ లో అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News