Wednesday, January 22, 2025

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైం: ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా నకిలీ లేబుళ్లు అంటించి నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, మానకొండూర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తానాబాద్ స్వప్న కాలనీకి చెందిన నూక రాజేశం (40) వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన ఇరుకుల్ల వేద ప్రకాశ్ (54) పెద్దపల్లికి చెందిన సతీష్‌లు ఒక ముఠాగా ఏర్పడి కల్తీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. పై వ్యక్తులు గతంలో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేసి నష్టపోయారు.

స్వల్పకాలంలో ఎక్కువ డబ్బులను సంపాదించాలనే ఉద్దేశ్యంతో గతంలో పరిచయం ఉన్న రైతులను లక్షంగా పెట్టుకొని ఈ నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే చర్యలకు పాల్పడుతున్నారు. పైన పేర్కొన్న వ్యాపారుల్లో పెద్దపల్లికి చెందిన వ్యాపారి సతీష్ పరారీలో ఉన్నాడు. పట్టుబడిన ఇద్దరు వ్యాపారులు నూక రాజేశం, ఇరుకుల్ల వేద ప్రకాశ్ వద్ద నుండి అష్టలక్ష్మి లేబుళ్లు అంటించి ఉన్న 19 స్టీల్ బాక్సులు, సాయి దివ్య పేరిట లేబుళ్లు అంటించి ఉన్న 31 ప్యాకెట్లు, మరో 20ఖాళీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారధి, ఇన్స్‌పెక్టర్లు సృజన్‌రెడ్డి, ఎం రవికుమార్, మానకొండూర్ సీఐ రాజ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News