- Advertisement -
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని నగరంలో ఐదేళ్లుగా తీర్పులు ఇస్తున్న నకిలీ కోర్టు గుట్టు రట్టయింది. నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, న్యాయమూర్తిగా తీర్పులు ఇచ్చిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ ను పోలీసులు అరెస్టు చేశారు. శామ్యూల్ అనుచరులే కోర్టు సిబ్బందిగా, న్యాయవాదులుగా నటించేవారు. గాంధీనగర్ లో తన కార్యాలయంలో నిజమైన కోర్ట వాతావరణాన్ని అతడు సృష్టించాడు.
అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ కరంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా శామ్యూల్ నకిలీ కోర్టు నడుస్తోంది. ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా నటిస్తూ తన క్లయింట్లకు అనుకూలమైన తీర్పులు, ఉత్తర్వులను జారీ చేసేవాడు. శామ్యూల్ ఇచ్చిన ఉత్తర్వులు అన్నీ నకిలీవని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ గుర్తించడంతో శ్యామ్యూల్ బండారం బయటపడింది.
- Advertisement -