Monday, December 23, 2024

చాంద్రాయణగుట్టలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణగుట్టలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. 30,000 లక్షల విలువగల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ నోట్లు తయారీకి ఉపయోగించిన ప్రింటర్, పేపర్,కలర్ బాక్సులను స్శాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News