Monday, January 27, 2025

నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

లక్ష రూపాయలకు నాలుగు రెట్లు అధికంగా నోట్లు అందజేస్తామని ఆశ చూపిస్తూ నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది గల ముఠా సభ్యులను కెయుసి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు నోట్లు 38 లక్షల 84 వేల రూపాయలతో పాటు, 21 లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, కారు, ఆటో, తొమ్మిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మణికాల కృష్ణ, హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, కేశవాపూర్‌కు చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్, కర్నూలు జిల్లా, వేల్పనూరు మండలం, కుర్వపేటకు చెందిన బిజిని వేముల వెంకటయ్య, భద్రాద్రి కొతగూడెం జిల్లా, బుర్గాంపాడ్ మండలం, నక్రిపేట తండాకు చెందిన దరామ్సోత్ శ్రీను, ఇదే తండాకు చెందిన తేజావత్ శివ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముల్కలపల్లి మండలం, ముకమామిడికి చెందిన గుగ్లోత్ వీరన్న, హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం,

కేశవాపూర్‌కు చెందిన ఉడుతా మల్లేష్, హనుమకొండ జిల్లా, హుజూరాబాద్ మండలం, పెద్దపాపయ్యపల్లికి చెందిన ఎర్రగొల్ల అజయ్‌లను పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడని తెలిపారు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేశాడని తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా నిందితుడు ప్రధానంగా గొర్రెల వ్యాపారం ద్వారా పరిచమయిన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దొరికిందని, అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలు ఎదురౌవుతున్నాయని నమ్మించేవాడని తెలిపారు. తనకు ఎవరైనా లక్ష రూపాలు ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండింతలు ఇస్తానని, ఒక లక్ష ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నొట్లను ఇస్తానని నమ్మించేవాడని తెలిపారు.

ఇదే తరహాలో మిగిలిన నిందితులను నమ్మించి, ఈ మోసాలకు తెగబడ్డాడని తెలిపారు. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రస్తుతం అరెస్టు చేసిన మరో నలుగురు నిందితులతో కారులో కెయుసి అవుటర్ రింగ్‌రోడ్డుపై పెగడపల్లి క్రాడ్ రోడ్ వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడే వున్న శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులతో కలిసి అసలు డబ్బుతో పాటు నకిలీ నోట్లను మార్పిడి చేసుకుంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఈ ముఠా సభ్యులందరినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద వున్న బ్యాగులు, కారులో తనిఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదుతోపాటు, నకిలీ నోట్లతో పాటు నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలను గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులంతా తమ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్లకాగితాలపై ఐదు వందల రూపాయల నోటు ముద్రించి పలుమార్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వి.యం.బంజర,

లక్ష్మీదేవిపేట పోలీస్ స్టేషన్‌ల్లో ప్రధాన నిందితుడిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన ఏసిపి దేవేందర్ రెడ్డి, కెయుసి ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐ మాధవ్, హెడ్‌కానిస్టేబుల్ నర్సింగ్ రావు, కానిస్టేబుళ్ళు శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్‌లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News