Friday, March 14, 2025

నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను ఎల్‌బి నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న గుజరాత్‌కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ.11,50,000 నకిలీ నోట్లు, రూ.4లక్షల ఒరిజినల్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లికిచెందిన చిన్నొళ్ల మాణిక్య రెడ్డి పెద్ద అంబర్‌పేట్‌లో ఉంటున్నాడు. నల్గొండ జిల్లా, దోమలపల్లెకు చెందిన మామిళ్ల జానయ్య, బీలకంటి భరత్‌కుమార్, జెల్ల వెంకటేష్, దొనకని సత్యనారాయణ, గుండాల వెంకటేష్, ఎపిలోని విశాఖపట్టనానికి చెందిన శివ శంకర్, గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌కు చెందిన సురేష్ అలియాస్ సురేష్ భాయ్ కలిసి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారు. ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డికి వ్యాపారంలో నష్టలు రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆన్‌లైలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడంపై వెతకగా గుజరాత్‌కు చెందిన సురేష్ భాయ్ నకిలీ కర్సెనీ చెలమణి గురించి తెలిసింది.

దీంతో జనవరిలో మాణిక్యరెడ్డి గుజరాత్‌కు వెళ్లి సురేష్‌ను కలిసి లక్ష ఒరిజినల్ నోట్లు ఇచ్చి రూ.11.50లక్షల నకిలీ కరెన్సీ నోట్లను తీసుకుని వచ్చాడు. తర్వాత ఈ ఈ విషయం జంగయ్య, వెంకటేష్, సత్యనారాయణ, భారతి,జి.వెంకటేష్‌కు చెప్పాడు. వారు ఒక ఒరిజినల్ నోటుకు నాలుగు నకిలీ నోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా నకిలీ బంగారం బిస్కెట్ల పేరుతో మోసం చేయాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే నకిలీ నోట్లు కావాల్సిన వారిని జంగయ్య ఓ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. అక్కడ లక్ష రూపాయల ఒరిజినల్ నోట్లను మాణిక్య రెడ్డి తీసుకుని నకిలీ నోట్లు వారికి ఇవ్వమని తన అనుచరులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే 11వ తేదీన సురేష్ భాయ్, మాణిక్యరెడ్డికి ఫోన్ చేసి విశాఖపట్టణానికి చెందిన శివశంకర్‌కు నకిలీ నోట్లు కావాలని చెప్పి అతడి వివరాలు చెప్పాడు. మాణిక్య రెడ్డి, శివశంకర్‌కు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాల్సిందిగా చెప్పాడు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన శివశంకర్ మాణిక్య రెడ్డిని కలిశాడు. అందరు కలిసి ఓ రెస్టారెంట్‌లో మాట్లాడుతుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే దాడి చేసి అందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ వినోద్‌కుమార్, డిఎస్సై నరేందర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News