Friday, January 3, 2025

నకిలీ వైద్యుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎలాంటి అర్హత లేకున్నా రోగులకు చికిత్స చేస్తున్న నకిలీ వైద్యుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి వైద్యానికి సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌కు చెందిన రాజు గంగారాం అంకాలపు రామంతపూర్, శ్రీనివాసపురంలో ఉంటూ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. నిందితుడు డిప్లమా కోర్సులో యోగా అండ్ నేచురోపతి అండ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చదివాడు. పూణేలోని రూబీ హల్ క్లినిక్‌లో 2019లో పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలోని న్యూ పటేల్‌నగర్‌లో వెంకటేశ్వర క్లినిక్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స చేస్తున్నాడు.

అంబర్‌పేట, రామంతపూర్ వాసులకు చికిత్స చేస్తు డబ్బులు సంపాదిస్తున్నాడు. నిందితుడి వద్ద ఎలాంటి డిగ్రీలు లేవని తెలియడంతో గతంలో పోలీసులు రెండు సార్లు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ వేరే ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నాడు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు అనంతచారి, కరుణాకర్ రెడ్డి, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News