Tuesday, November 5, 2024

నకిలీ డాక్టర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

fake doctor arrested in hyderabad

రష్యా మెడికల్ కాలేజీ నకిలీ సర్టిఫికేట్‌తో పలు ఆస్పత్రుల్లో వైద్యం
గతంలో పిఆర్‌ఓ, కాంపౌండర్‌గా పనిచేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: నకిలీ వైద్య సర్టిఫికేట్‌తో పలువురు అమాయకులకు వైద్యం చేస్తున్న యువకుడిని ఎల్‌బి ఎస్‌ఓటి, మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ ఎంబిబిఎస్ సర్టిఫికేట్, నకిలీ అడ్మిషన్ ఆఫర్ లెటర్, నకిలీ ఐడి కార్డు, స్టెతస్కోప్,పాస్‌పోర్టు, మూడు మొబైల్ ఫోన్లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా, హుజూర్‌నగర్‌కు చెందిన కుడిలేటి విజయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా, ఎల్‌బి నగర్‌లో ఉంటున్నాడు, నగరంలోని మల్లేపల్లికి చెందిన మహబూబ్ అలీ జునైద్ కంప్యూటర్ సర్వీస్, వికారాబాద్ జిల్లా, పూడురు మండలం, కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన అఫ్రోజ్ ఖాన్ వ్యాపారం చేస్తున్నాడు. విజయ్‌కుమార్ డిగ్రీ బిఎస్సీ నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. గతంలో పలు ఆస్పత్రుల్లో పిఆరోఓ, కాంపౌండర్‌గా పనిచేశాడు.

దీంతో వైద్య రంగంపై పట్టు పెంచుకున్నాడు. వైద్యులకు సహాయకుడిగా పనిచేయడంతో రోగులకు ఎలా చికిత్స చేస్తున్నారో తెలుసుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసే అఫ్రోజ్ ఖాన్, మహ్మద్ అలీ జునైద్ పరిచయమయ్యారు. తానకు ఎలాగైన ఎంబిబిఎస్ సర్టిఫికేట్ కావాలని వారిని అడిగాడు. నకిలీ ఎంబిబిఎస్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిందితులు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. విజయ్‌కుమార్ ఇద్దరు నిందితులకు రూ.6,50,000 ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న ఇద్దరు రష్యాకు చెందిన కాజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన నకిలీ ఎంబిబిఎస్ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఈ సర్టిఫికేట్‌తో నిందితుడు ఉప్పల్‌లోని లైఫ్ కేర్‌లో కోవిడ్ సమయంలో ఆరు నెలలు పనిచేశాడు. ఈ సమయంలో నిందితుడికి రూ.60,000 నెలకు ఇచ్చారు. తర్వాత ఆర్‌కె ఆస్పత్రిలో ఎండి ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు నిందితులు నగరానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తికి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను ఇవ్వడంతో అతడు యూఏఈకి వెళ్లి పనిచేస్తున్నాడు. నిందితులు ఎవరెవరికి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినది విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, మహేందర్ రెడ్డి, ఎస్సైలు తకియుద్దిన్, ఉదయ్‌భాస్కర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News