Tuesday, January 7, 2025

నకిలీ డాక్టర్ క్షుద్రపూజలు.. సేవలో విఐపిలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యం పేరుతో పలువురు అమాయకులకు క్షుద్రపూజలు చేస్తున్న నకిలీ వైద్యుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పూజలకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తరాది రాష్ట్రానికి చెందిన జ్ఞానేశ్వర్ రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్‌బినగర్‌లో జిఎన్‌ఆర్ ఆయుర్వేదం పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేశాడు.

తన వద్దకు ఆయుర్వేదం వైద్యానికి వచ్చే భక్తులకు వివిధ పేర్లు చెప్పి మీకు చేతబడి చేశారని చెప్పేవాడు. దానిని నమ్మిన వారికి క్షుద్రపూజలు చేసేవాడు. దీనికి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. నిందితుడు అసలు ఆయుర్వేదంలో ఎలాంటి కోర్సు చేయలేదని, నకిలీ సర్టిఫికేట్లతో చెలామణి అవుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడి వద్ద పలువురు విఐపిలు కూడా పూజలు చేయించుకున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం ఎల్‌బి నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News