Tuesday, January 21, 2025

నకిలీ డాక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హెయిర్ ప్లాంట్ చికిత్స చేస్తున్న నకిలీ వైద్యుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, కాలాపత్తర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి వైద్యానికి సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బహదురుపురాకు చెందిన అస్లాం షఫీ సయిద్ గచ్చిబౌలిలోని రెడీఫైన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నిందితుడు ఇటీవల కాలంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నాడు. ఎలాంటి సర్టిఫికేట్లు లేకున్నా హెయిర్‌ప్లాంట్, స్కిన్ వైద్యుడిగా చెప్పుకుంటున్నాడు. తన ఇంట్లోనే వచ్చిన వారికి చికిత్స చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాలాపత్తర్ పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ షేక్ జకీర్, ఎస్సైలు నర్సింహులు, ఆంజనేయులు, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News