Saturday, January 11, 2025

నకిలీ పత్రాలతో అమెరికాకు పంపిస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులగా నమ్మిస్తూ అమెరికాకు పంపుతున్న కన్సల్‌టేన్సీ నిర్వాహకులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నకిలీ ఐడి కార్డులు, ఐదు పాస్‌పోర్టులు, చెక్కుబుక్కులు, నకిలీ ఇన్విటేషన్‌కార్డులు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, రూ.18,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,02,970 నగదును సీజ్ చేశారు. మల్కాజ్‌గిరి డిసిపి జానకి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన గార్లపాటి వెంకట దుర్గా నాగేశ్వర సిద్దార్ధా అలియాస్ గార్లపాటి విల్సన్ చౌదరి సెయింట్ ఆంథోని ఇమ్మిగ్రేషన్‌ను ఏర్పాటు చేశాడు.

అల్వాల్‌కు చెందిన నాతాల ప్రభాకర్ రావు కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు, నిజామాబాద్‌కు చెందిన జక్కుల నాగేశ్వర్, ఫైనాన్షియర్ గొటుకుల నాగరాజును అరెస్టు చేశారు. విల్సన్ చౌదరి ఆరు ఏళ్ల క్రితం కన్సల్‌టెన్సీని ఏర్పాటు చేసి అక్రమ పద్ధతిలో అమెరికాకు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన వారి వద్ద నుంచి రూ.5లక్షలు తీసుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా నకిలీ ఐడి కార్డులను తయారు చేయిస్తున్నాడు. అంతేకాకుండా అమెరికాలో ఉంటున్న దంపతులను చూసేందుకు వెళ్తున్నట్లు ఇక్కడి అమెరికా కన్సులెట్‌ను నమ్మించేందుకు వారి ఇచ్చినట్లు నకిలీ లెటర్లను తయార చేశాడు. వాటిని అమెరికన్ కాన్సులేట్ అధికారులకు చూపించి వీరు అమెరికాలో ఉన్న బంధువులను చూసి తిరిగి వస్తారని, వెళ్లే వారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులని చెప్పి నమ్మిస్తున్నారు.

ఇలా 60మందిని అమెరికాకు వెళ్లేందుకు వీసా ఇంటర్వూకు పంపించగా, అందులో 10మంది మాత్రమే అమెరికాకు వెళ్లారు. ఇలా వెళ్లే వారు ముందుగా బ్యాంక్ ఖాతాలో రూ.50లక్షల డిపాజిట్ చూపించాల్సి ఉండడంతో ఫైనాన్షియర్ నాగరాజుతో మాట్లాడి రోజుకు 1.5 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని డిపాజిట్‌ను చూపిస్తున్నారు. వీటిని నమ్మడంతో పదిమందికి వీసా వచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News