Wednesday, January 22, 2025

నల్గొండలో నకిలీ మహిళా పోలీస్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఓ నకిలీ పోలీస్ రియల్ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నార్కట్ పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి అర్హత సాధించింది. కానీ మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా విఫలమైంది. ఆమె అప్పటికే  తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో  తాను ఎస్ఐ అవుతున్నట్లు ప్రచారం చేసుకుంది. తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకుని, నకిలీ ఐడి కార్డుతో చలామణి అయింది. అసలు విషయం కాస్త బయటపడడంతో రంగంలోకి దిగిన అర్.పి.ఎఫ్ పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకుని మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News