Monday, February 24, 2025

ప్రకాశం జిల్లాలో నకిలీ ఐఏఎస్ అమృత రేఖ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ట్రైనీ ఐఎఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న అమృత రేఖ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గతంలో అరెస్ట్ కాగా, అతడు బెయిల్ పై బయట ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఐఎఎస్ అధికారినని చెప్పుకుంటూ అమృత రేఖ అనేకమందికి టోకరా వేసింది. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీసుస్టేషన్‌లోనూ, నగరంలోని పలు ఇతర పోలీస్ స్టేషన్లలోనూ ఆమెపై పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను పట్టుకునేందుకు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నకిలీ ఐఎఎస్ అని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News