Wednesday, January 22, 2025

నకిలీ ఇక్కత్ చీరలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భూదాన్‌ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోచంపల్లి చేనేత ఇక్కత్ డిజైన్‌ల వస్త్రాలను కాపీ కొట్టి, తక్కువ ధరలో నాణ్యత లేని మిల్లు వస్త్రాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో 15 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. అనుమానం ఉన్న 18 చీరలు, వస్త్రాలను స్వాధీనం చేసుకుని 12 దుకాణాల యజమానులకు చేనేత పరిరక్షణ చట్టం సెక్షన్ 6 ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎం.వెంకటేశం, సహాయ సంచాలకులు విద్యాసాగర్, ఎడి జయరాజ్, డిఒలు ప్రసాద్, ప్రవీణ్, సంధ్య, ఎడిఒలు అనిల్, సాయి, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి ఎం. వెంకటేశం మాట్లాడుతూ పోచంపల్లి చేనేత డిజైన్లను పోలిన మిల్లు వస్త్రాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News