Sunday, November 17, 2024

చైనాలో భారత్ నకిలీ కొవిడ్-19 ఔషధాలు?!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో కొవిడ్-19 వ్యాధి ఎంతగా వ్యాపిస్తుందో అంతగా భారతీయ కొవిడ్ నకిలీ ఔషధాలు కూడా అక్కడ మార్కెట్ అవుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త అని చైనా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫైజర్ కంపెనీ తయారు చేసిన పాక్స్‌లోవిడ్, ఇండియన్ జనరిక్ వర్షన్స్ అక్కడి బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. పాక్స్‌లోవిడ్ వంటి ఆమోదిత యాంటీవైరల్స్ కొరత చైనాలో విరివిగా ఉండడంతో అక్కడ ఫేక్ కొవిడ్ ఔషధాలకు తలుపులు తెరిచింది.

బ్లాక్‌మార్కెట్‌లో ఇప్పుడు పాక్స్‌లోవిడ్ బాక్స్‌లు దాదాపు 50000 యువాన్లకు(7200 డాలర్లకు) అమ్ముడవుతున్నాయి. చైనాలో చాలా మంది చౌకైన ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. దీంతో భారతీయ తయారీ ఔషధం యొక్క జెనరిక్ వెర్షన్‌లకు డిమాండ్‌ను పెరుగుతోంది. అయితే నకిలీ ఔషధానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లభించడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News