Monday, December 23, 2024

నకిలీ ఇన్సురెన్స్ చేయిస్తున్న ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సుల్తానాబాద్: ప్రముఖ ఇన్సురెన్స్ కంపెనీ పేరిట వాహనాలకు నకిలీ ఇన్సురెన్స్ చేయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాల మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ ఉపేందర్‌రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని కనుకుల గ్రామ శివారులో గతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధి టాటా మ్యాజిక్ వాహనానికి ఇన్సురెన్స పరిహారం క్లెయిమ్ చేసేందుకు వెహికల్ ఓనరు వేము అశిష్, వరికోలు గ్రామం కొహెడ మండలం అనే వ్యక్తి సంబంధిత పత్రాలను నమదు చేశారు. అయితే, ఈ వెహికల్ ఇన్సురెన్స్ నకిలీగా హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సురెన్స్ విభాగం అధికారులు తేల్చారు. ఈ విషయమైన ఇన్సురెన్స్ మేనేజర్ సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా.. నకిలీ ఇన్సురెన్స్ రాకెట్ ముఠా దొరికింది. ఓదెల మండలం శానగొండ గ్రామానికి చెందిన గాజుల లక్ష్మన్ అనే ఆటో డ్రైవర్ వరంగల్ మెకానిక్ షాపు వద్ద పరిచయమైన మహ్మద్ షఫీ అనే వ్యక్తితో కలిసి ఈ నకిలీ ఇన్సురెన్స్ సృష్టించి పలువురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. తనకు పరిచయం ఉన్న డ్రైవర్ల వద్ద రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సేకరించి, వెహికల్స్ ఆర్‌సీ బుక్‌లను, ఇతర పత్రాలను లక్ష్మణ్, మహ్మద్ షఫీకి వాట్సప్ ద్వారా పంపే వాడు. వీటి ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఇప్పటి వరకు 60 వరకు తయారు చేసినట్లు తెలిసింది. వారిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News