- Advertisement -
అమరావతి: పవన్ పర్యటనలో నకిలీ ఐపిఎస్ హల్ చల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ వెంట నకిలీ ఐపిఎస్ అధికారి తిరిగారు. ఈ విషయం ఆలస్యంగా అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బందితో కేటుగాడు పోటోలు దిగాడు.
అతడు నకిలీ ఐపిఎస్ అధికారి అని తెలయడంతో అతడిని విజయనగరం రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగర్ జిల్లా గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాశ్ గా గుర్తించారు. పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై హోంశాఖ మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కు వై కేటగిరీ భద్రత ఉంటుందని, కానీ నకిలీ ఐపిఎస్ సూర్య ప్రకాశ్‌ను గుర్తించకపోవడంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -