- Advertisement -
హైదరాబాద్: నగరంలో నకిలీ ఐపిఎస్ అధికారి అవతారం ఎత్తిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని శ్రుతి సిన్హాగా గుర్తించారు. యువతి పెళ్లిపేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బుతో 3 ఖరీదైన కార్లు కొనుగోలు చేసి జల్సా చేసింది. విషయం బయటపడడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి మూడు కార్లు, రూ.6కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. బంధువు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది శ్రుతి. అయితే ఆమె బంధువు విజయ్ కుమార్ నెల క్రితం ఎపిలో సూసైడ్ చేసుకున్నాడు.
Fake IPS Officer Arrested in Hyderabad
- Advertisement -