Friday, January 31, 2025

యూరప్‌లో ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

మాల్టా, ఇతర యూరోపియన్ దేశాలలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. 100 మంది బాధితుల నుంచి రూ.5లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.5 కోట్లు ఈ ముఠా కాజేసింది. ఘట నకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాకు చెందిన బాధితుడు గోనె శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ముఠా హైదరా బాద్ కెపి హెచ్‌బిలో ‘విదేశాలలో అధ్యయన ప్రణాళిక కన్సల్టెన్సీ’ మాల్టా, లాట్వియాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.7 లక్షలు కాజేశారు. ఈ మేరకు ఖానాపూర్ పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఆ కేసు ఖానాపూర్ పోలీసుస్టేషన్ నుంచి హైదరాబాద్ సిఐడి ఆర్థిక నేరాల విభా గానికి బదిలీ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సిఐడి

ఆర్థిక నేరాల విభాగం ఈ ముఠా గుట్టును రట్టు చేసి ముఠా సభ్యుల లోని ఇద్దరు నిందితులు కొట్టు సాయి రవితేజ, కొట్టు మనోజ్‌లను అరెస్టు చేసింది. ముఠా సభ్యులు ఘంటా అనిల్ కుమార్, ఘంటా సునీల్ కుమార్, కొట్టు సాయి రవితేజ, కొట్టు సాయి మనోజ్, శుభం, వంశీ ఇతరులతో కలిసి హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో బ్రాంచ్‌లు నెలకొల్పి మరీ మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దాదాపుగా 100 మంది బాధితులు ఈ ముఠా బారిన పడ్డారు. ఉద్యోగా లొస్తాయన్న గంపెడాశతో ఒక్కొక్కరు సదరు ముఠాకు రూ.5లక్షల చొప్పున చెల్లించి ఆనక ఉద్యోగం లభించక పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా, ఈ ముఠాలో మొత్తం ఆరుగురిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News