Saturday, April 5, 2025

స్పిరిట్@ బ్రాండెడ్ లిక్కర్!

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లాలో జోరుగా నకిలీ మద్యం
సరఫరా స్పిరిట్, లిక్విడ్స్ కలిపి ఖరీదైన
మద్యం తయారీ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో
బట్టబయలైన బాగోతం ఎక్సైజ్ మొద్దు నిద్ర

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో : నాన్‌డ్యూ టీ పెయిడ్(ఎన్‌డిపి)మద్యం విక్రయాలకు అడ్డా బ్రాండెడ్ బాటిల్స్ మూతలు తీయడం.. తక్కు వ ధర లిక్కర్ కలవడం.. మళ్ళీ యధావిధిగా బా టిల్స్ తయారు చేయడం.. ఇదంతా కొందరు ని పుణులు చేసే పని. ఈ తతంగాన్ని గతంలో పోలీసులు ఛేదించారు. కట్టడిచేసే ప్రయత్నం చేశా రు. కానీ ఇప్పుడు ఏకంగా స్పిరిట్, అందులో క లిపే లిక్సిడ్స్‌తోనే బ్రాండెడ్ మద్యం తయారీ చే స్తున్నారు. ఇందులో నైపుణ్యత సాధించిన కొం దరు కేటుగాళ్ళు స్పిరిట్‌ను ఖరీదైన లిక్కర్‌లో నింపి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని మారుమూల వైన్స్‌షాపు లు, బెల్ట్‌షాపులను టార్గెట్‌గా చేసుకొని నకిలీ మ ద్యం దందా సాగిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఈ దందా సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. వ్యవసాయ క్షేత్రాలు, తోటలను అడ్డాగా చేసుకొని మూడు పువ్వులు ఆరు కాయలుగా నకిలీమ ద్యం తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తయారీకి పెట్టుబడి పెట్టడం.. తయారుచేసిన బాటిల్స్ పెద్దమొత్తంలో తరలిస్తూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచా రం.

నల్లగొండ జిల్లాలోని కనగల్, నాంపల్లి మం డలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు విజయవాడ కు చెందిన సూత్రధారితో చేతులు కలిపి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేసి మెరుపుదాడులు చేయడంతో నకిలీ మద్యం దందా వ్యవహారం బట్టబయలైంది. కనగల్ మండలం, యడవల్లికి చెందిన ఓ పార్టీ నేత భార్గవ్ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఆయన నుంచి సమాచారం సేకరించి నాంపల్లి మండలం, గానుగుపల్లిలో పండ్ల వ్యాపారి రమేష్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో దాడులు చేసి 1500 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుంతలు తీసి పెద్దపెద్ద డ్రమ్ముల్లో దాచిన స్పిరిట్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకొని అసలు సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీగంతా లాగి అసలు డొంకను కదిలించేందుకు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్‌తో బ్రాండెడ్ మద్యం తయారీ చేస్తున్నట్లు కేటుగాళ్ళు ఒప్పుకోవడం.. వైన్స్‌షాపులు, బెల్ట్‌షాపులకే విక్రయాలు చేసినట్లు చెప్పడంతో ఖరీదైన మందు తాగిన మందుబాబులు తాము తాగింది స్పిరిటా? అంటూ భయపడిపోతున్నారు.

తోటలు, వ్యవసాయక్షేత్రాలే సేఫ్‌జోన్‌లు..
వ్యవసాయ క్షేత్రాలు, బత్తాయితోటలను సేఫ్‌జోన్‌లుగా ఎంచుకున్న కేటుగాళ్ళు స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారీ చేస్తున్నారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండలంలో.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మరిగ్రూడ, చండూరు తదితర ప్రాంతాల్లో దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. లోతైన గుంతలు తీసి పెద్దపెద్ద డ్రమ్ముల్లో స్పిరిట్‌ను ఉంచి అవసరమైనప్పుడు బయటకు తీస్తూ లిక్కర్ తయారుచేయడం.. అక్కడి నుండి గుట్టుచప్పుడు కాకుండా వైన్స్‌షాపులు, బెల్ట్‌షాపులకు సప్లయి చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఎక్సైజ్ శాఖకు పట్టింపేదీ?
ఎన్‌డిపి మద్యం.. నకిలీమద్యం.. సీసాల మూతలు పీకి నీళ్ళు కలిపి మందు తయారు చేయడం.. నాటుసారా తయారీ.. వంటి ఘటనలు జరుగకుండా ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా పెట్టాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కట్టడిచేసే పనిలో నిమగ్నం కావాలి. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే నల్లగొండ జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ మద్యం తయారీని గుట్టురట్టు చేసే వరకు ఎక్సైజ్ శాఖ ఏమాత్రం శ్రద్ధ వహించకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. తయారీదారులు.. విక్రయదారులపై తూతూ మంత్రంగా దాడులు చేసి ‘మమ’ అనిపిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో స్పిరిట్, లిక్విడ్స్‌తో పెద్ద మొత్తంలో బ్రాండెడ్ బాటిల్స్ తయారుచేస్తుంటే ఎక్సైజ్ అధికారులు మొద్దునిద్రపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి నకిలీ మద్యం తయారీని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News