Thursday, January 23, 2025

సిఎంఆర్‌ఎఫ్‌ కోసం అడ్డదారి తొక్కిన ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ :ముఖ్యమంత్రి సహయనిధి (సిఎంఆర్‌ఎఫ్) కోసం పట్టణంలో ఓ ఆసుపత్రి యాజమాన్యం అడ్డదారి తొక్కింది. వైద్యసేవలు అందించకుండానే మెడికల్ బిల్లులు సృష్టించి దొడ్డిదారిలో సొమ్ము కాజేసినట్లు సైఫాబాద్ సీసిఎస్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీనిపై నల్లగొండ జిల్లా వైద్యాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని మహేష్ మల్టీస్పెషాలిటి ఆసుపత్రిలో శుక్రవారం డిప్యూటి డిఎంహెచ్‌వో కేస రవి ఆధ్వర్యంలో వైద్య అధికారుల బృందం తనిఖీలు జరిపింది.

రోగుల కేషీట్‌లతోపాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో ఈ ఆసుపత్రి పేర్లను మార్చడం వెనుకగల కారణాలపై అధికారులు యాజమాన్యాన్ని ప్రశ్నించి వాంగ్మూలం రికార్డు చేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహడ్‌కు చెందిన బి. జ్యోతి పాముకాటు, బి. లక్ష్మీ కిడ్నీ సంబంధిత వ్యాధి, దామరచర్ల మండలం మంగళ్ దుబ్బతండాకు చెందిన ధీరావత్ నాగు (నరేష్) పురుగుల మందు పిచికారి చేస్తూ ఆరోగ్యం విషమించగా గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లుగా వైధ్యాధికారులు గుర్తించారు.

అయితే ముగ్గురు వ్యక్తులకు అందించిన వైద్య సేవలకు సంబందించిన కేషీట్లను పరిశీలించి అందులోని కీలక అంశాలను అధికారులు రికార్డు చేశారు. తనిఖీలో అధికారులు గుర్తించిన అంశాలను నివేదికలో పొందుపర్చారు. సోమవారం మరో సారి డిఎంహెచ్‌వో తనిఖీలు జరిపి తుది నివేదికను సైఫాబాద్ సీసీఎస్ పోలీసులకు సమర్పించనున్నారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News