హైదరాబాద్: కుషాయిగూడ పోలీసులు నకిలీ నక్సలైట్ ను అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి జిల్లాకు చెందిన నరసింహ అలియాస్ దామోదర్ నక్సలైట్ పేరుతో నగరంలో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భగవాన్ కాలనీకి చెందిన ఓ వ్యాపారికి ఫోన్ చేసిన రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.10 లక్షల నుంచి చివరకు రూ.50 వేల వరకు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడిని పట్టుకున్నారు.నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నిందితుడు దామోదర్, పాత ఫోన్లు కొని.. వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని ఫోన్ చేసి అడిగినంత డబ్బులు ఇవ్వాలిన బెదిరింపులకు పాల్పడ్డాడని, జవహర్ నగర్ లో ఓ ప్రజాప్రతినిధిని కూడా ఇలాగే బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Fake Naxalite detained by Kushaiguda Police