- Advertisement -
హైదరాబాద్: ఫేక్ జర్నలిస్టుల గురించి మాత్రమే రేవంత్ మాట్లాడారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఫేక్ వల్ల అసలైన జర్నలిస్టులకు నష్టం జరుగుతోందని మండిపడ్డారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే బిఆర్ఎస్, బిజెపి పని అని ఎంపి చామల దుయ్యబట్టారు.
- Advertisement -