Thursday, December 19, 2024

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిపై అసత్యప్రచారం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ బ్రేయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే సైబరాబాద్ జాయింట్ సిపిగా నారాయణ్ నాయక్ నియమితులయ్యారు. గతంలో నారాయణ్‌నాయక్ ఎపిలోని చిత్తూరు జిల్లా, పశ్చిమగోదావరి, ఏటూరు జిల్లా ఎస్పిగా పని చేశారు.

కాగా ఇటీవలే హైదరాబాద్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారని కొందరు ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జాయింట్ సిపి నారాయణ్ నాయక్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News