Thursday, January 23, 2025

భైంసా పట్టణంలో నకిలీ నోట్లు కలకలం

- Advertisement -
- Advertisement -

భైంసా: ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా పట్టణంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. భైంసా పట్టణంలో ప్రతి సోమవారం వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతలో కూరగాయలు అమ్మడాని రైతులు వస్తుంటారు. అలాగే మహరాష్ట్ర సరిహద్దు కావడంతో అక్కడి రైతులు సైతం కూరగాయలు అమ్మడానికి సంతకు వస్తుంటారు. కాగా సోమవారం సాయంత్రం సంతలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. 12 సంవత్సరాల బాలుడు ప్రవీణ్ అనే కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర 20 రూపాయల కూరగాయలు కొని 500 రూపాయలు ఇచ్చాడు.కాగా ప్రవీణ్  బాలుడుకి 480 రూపాయలు ఇచ్చాడు.

కొద్దిసేపటి తర్వాత అదే బాలుడు మళ్లీ 500 రూపాయలు తీసుకొని వచ్చి మళ్లీ 20 రూపాయల కూరగాయలు కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారి పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకి కోసం స్థానికంగా ఉండే సిసి కెమెరాలను పరిశీంచారు. వ్యాపారి వద్ద ఉన్న రెండు 500 రూపాయల నోట్లు నకిలీవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News