హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ పాస్ పోర్ట్ ముఠా గుట్టు రట్టైంది. ఐదుగురు వ్యక్తుల అరెస్టుతో అతిపెద్ద అంతర్జాతీయ నకిలీ పాస్‌పోర్ట్, వీసా రాకెట్‌ను ఛేదించినట్లు ఢిల్లీ పోలీసు ఐజిఐ (ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) యూనిట్ శనివారం పేర్కొంది. ఈ ఘటనలో కడపకు చెందిన కీలక నిందితుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని జాకీర్ పోలీసులు గుర్తించారు. కడప నగరం మాచుపల్లి బస్టాండ్ కు చెందిన జేకే ట్రావెల్స్ జాకిర్ గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి చైనా, ఆస్ట్రేలియా, యుఎస్, ఇతర దేశాలతో సహా 325 నకిలీ పాస్‌పోర్ట్‌లు, 175 నకిలీ వీసాలను, 1,200కుపైగా రబ్బర్ స్టాంప్, 77 బయో పేజీలు, 12 ప్రింటర్, పాలిమర్ స్టాంప్ మెషిన్, అల్ట్రా వైలెట్ లైట్ మెషిన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జాకీర్ వెబ్ సిరీస్‌లలో కూడా డబ్బు పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జాకీర్ ను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
అంతర్జాతీయ నకిలీ పాస్‌పోర్టు రాకెట్ గుట్టు రట్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -