Sunday, December 22, 2024

నకిలీ పోలీసు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః బ్యూటీ పార్లర్ల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10,000 నగదు, మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…గుడిమల్కాపూర్‌కు చెందిన మరికొండ సాయికిరణ్ తేజ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

తాను ఇంటెలీజెన్స్‌లో పనిచేస్తున్నానని చెప్పి బ్యూటీ పార్లర్ల యజమానులకు నకిలీ ఐడి కార్డు చూపించి బెదిరిస్తున్నాడు. ఇలా వారిని గత కొంత కాలం నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రాయదుర్గంలోని ఫార్చూన్ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ ఫ్లోర్‌లో స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్ యజమానిని బెదిరింబి రూ.10,000 తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని బయటికి వస్తుండగా మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News