Wednesday, January 22, 2025

నకిలీ పోలీస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

పోలీసుల పేరు చెప్పి బెదిరించి అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.95,000 నగదు, బ్యాగు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….కర్నాటక రాష్ట్రం, బీదర్ ఇరానీ గల్లీకి చెందిన జాఫర్ అలీ అలియాస్ లంబు స్టోన్ ఫిట్టింగ్ పనిచేస్తున్నాడు. ఇరానీ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్న జాఫర్ అలీ హైదరాబాద్‌లో వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతంలో సంచరిస్తుంటాడు.

నగదు తీసుకుని వచ్చిన వారిని ఆపి పోలీస్‌గా చెప్పుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేస్తున్నాడు. బ్యాగుల్లో నగదు కన్పిస్తే వారిని పోలీసుల పేరుతో బెదిరించి బాధితుల దృష్టి మరల్చి డబ్బులతో పారిపోతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సై నగేష్ తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News