Sunday, December 22, 2024

వృత్తి ఆటో డ్రైవర్.. ప్రవృత్తి ఆర్టీఎ ఎజెంట్

- Advertisement -
- Advertisement -

వృత్తి ఆటో డ్రైవర్.. ప్రవృత్తి ఆర్టీఎ ఏజెంట్..కష్టం లేకుండా తక్కవ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో నకిలీ ఆర్టీఓ అవతారం ఎత్తాడు. బ్రీజ కారు లో దర్జాగా వెళ్లి..ల్యాప్ టాప్ ఓపెన్ చేసి..ట్రాక్టర్ల పై చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రింగ్ కాంక్రీట్ విల్లర్లను బెదిరిస్తూ భారీగా డబ్బులు వ సూలు చేస్తున్న నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని రెడ్ హ్యాండ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ హనుమ సాయి నగర్ లో నివసిస్తున్న ప్రేమ్ కుమార్ రెడ్డి (42) ఆటో డ్రైవర్. ఒకవైపు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూనే మరొకవైపు ఆర్టిఎ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. చేసిన పనికి వచ్చే డబ్బులు సరిపడక నకిలీ ఆర్టీవో గా అవతారమేత్తి అమాయక సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్స్ ను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అనుమానం రాకుండా బ్రీజ కారులో దర్జాగా వెళ్లి జరుగుతున్న పనులను ఆపించి ట్రాక్టర్లకు టాక్స్,

పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి ధ్రువీకర ణ పత్రాలు లేవని బెదిరిస్తుండడంతో తమ లోపాలను అర్థం చేసుకున్న మిల్ల ర్లు అడిగినంత డబ్బులు ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉప్పల్, రామంతపూర్, నాచారం, చిల్కానగర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నారపల్లి, ఘట్కేసర్ పరిసర ప్రాంతాలలో నిత్యం తెల్లవారుజామున 4 నుంచి 7 గంట ల వరకు వేలాది రూపాయలు వసూలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. చెకింగ్ సమయంలో డబ్బులు లేక పోవడంతో ఫోన్ పే ద్వారా వసూలు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద బెదిరించి వసూలు చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన మిల్లర్ల సంఘం ప్రతినిధులు నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డి ని పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నకిలీ ఆర్టీవో పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్లు, మేస్త్రీలు ఉప్పల్ పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. వివాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

నకిలీ ఆర్టీఓ పై గత వారం రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యా దు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనెస్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. నకిలీ ఆర్టీఓ వెనుక ఎవరెవరు పాత్ర ఉందో తెలుసుకోవడానికి విచారణ వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News