మూడు రాష్ట్రాలకు చెందిన నిందితులు అరెస్టు
కారు, డీసీఎం, నగదు, నకిలీ విత్తనాలు స్వాధీనం
మన తెలంగాణ/వరంగల్ క్రైం: నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న మూడు రాష్ట్రాలకు చెందిన ముఠా గుట్టు రట్టయింది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ టాస్క్‌ఫోర్స్‌తో వలపన్ని ఆ ముఠా గుట్టును రట్టు చేశారు. గురువారం మూడు రాష్ట్రాలకు చెందిన నకిలీ విత్తనాల వ్యాపారులను అరెస్టు చేసి వారి నుండి రూ.2కోట్ల11లక్షల విలువ గల నకిలీ విత్తనాలు, ఏడు టన్నుల విడి విత్తనాలు, 9765 నకిలీ విత్తనాల ప్యాకెట్లతో పాటు డీసీఎం, కారు, రూ.21లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఎనుమాముల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
పోలీసులు అరెస్టు చేసిన రెం డు ముఠా సభ్యుల్లో దాసరి శ్రీనివాస్ కర్నూల్ జిల్లా ఆంధ్రప్రదేశ్, చేదాం పాండు హైదరాబా ద్, కొప్పుల రాజేశ్ మంచిర్యాల, వడిచర్ల సురేందర్‌రెడ్డి మహారాష్ట్ర చంద్రపూర్, ఏన్గూడే దిలీప్ మహారాష్ట్ర బల్లర్ష, బోగే సత్యం మంచిర్యాల, షేక్ అన్జద్ మంచిర్యాల, ఇందుర్తి వెంకటేశ్ మంచిర్యాల, పుట్ట రాజేశం మంచిర్యాల, చేదాం వెంకటరమణ హైదరాబాద్, చేదాం నాగరాజు మహబూబ్‌నగర్, సుందర్‌శెట్టి ఫణీందర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల, కాల్వ శ్రీధర్ నాగర్‌కర్నూల్ జిల్లా, తాఫ్తే హనుమంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా, వేముల అరవింద్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన వీరిని అరెస్టు చేయగా శివారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గంప సదాశివ్‌లు ప్రస్తు తం పరారీలో ఉన్నట్లు రంగనాథ్ తెలిపారు. ముఠాలోని సభ్యులు రైతుల నుండి తక్కువ ధర కు విడిగా విత్తనాలు కొనుగోలు చేసిన వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శుద్ధి చేసేవారు. శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను తెలంగాణ, మహారాష్ట్రలోని పలు జిల్లాల కు చెందిన విత్తన డీలర్లకు, రైతులకు ఈ ముఠా విక్రయించేవారు.
మరో ముఠాకు చెందిన ప్ర ధాన నిందితుడు చేదాం పాండు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీగణేశ్ విత్తన శుద్ధి కం పెనీ ఉన్నాయని, ఈ కంపెనీ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ నుండి దిగుమతైన విత్తనాలను ఈ కంపెనీల ద్వారా ఉప విక్రయ లైసెన్సుదారుడిగా ఉందంటూ తెలంగాణలోని వివిధ జిల్లాలకు విత్తనాలు విక్రయించేవాడు. ఇదే అదునుగా భావించిన ఈ నిందితు డు మరి కొందరితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు అసలైన నర్మద కంపెనీకి చెం దిన విత్తన ప్యాకెట్లను తీసిపోని విధంగా క్యూఆర్‌కోడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్ర మ సంఖ్య, యం.ఆర్.పిలతో కూడిన నకిలీ న ర్మదా విత్తన ప్యాకెట్లను తయారు చేసిన వీటిలో నకిలీ విత్తనాలు ఉంచి ఈ నకిలీ నర్మద కంపెనీ విత్తన ప్యాకెట్లను మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో విక్రయించేవారు.
పోలీసులకు పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఎనుమాముల. వ్యవసాయ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్టు చేసి విచారించగా నిందితులు పాల్పడిన నేరాలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, మామునూరు ఏసీపీ కృపాకర్, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యవసా య అధికారులను వరంగల్ పోలీసు కమిషనర్ అభినందించారు.