Monday, January 20, 2025

బండి సంజయ్ పై ఫేక్ వీడియో

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపీ, కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్‌పై ఫేక్ వీడియోను సృష్టించారనే ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డులు సృష్టించి తన సోషల్ మీడియాఖాతాలో దుష్ప్రచారం చేశారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బిజెపి నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.

బిజెపి నేతల ఫిర్యాదుపై స్పందించిన కరీంనగర్ టూటౌన్ పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమిత్ షా ఫేక్ వీడియో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగా ణలోను ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జులను అరెస్ట్ చేశారు. వారికి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News